ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లోని వివిధ విభాగాల్లో 1,289 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ రెసిడెంట్ (క్లినికల్) 603, నాన్ క్లినికల్ 590, సూపర్ స్పెషాలిటీ 96 పోస్టులకు మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ/ ఎండీఎస్) చదివిన వారు అర్హులు. వయసు 44 ఏళ్లకు మించకూడదు. నెలకు జీతం పోస్టును బట్టి రూ.80,500 నుంచి రూ.97,700 ఇస్తారు. జనవరి 8లోగా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ https://dme.ap.nic.in/.