AP: సీఎం చంద్రబాబు ఎక్స్‌లో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇటీవల తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన యువతి యోగాలో గిన్నిస్ రికార్డు సృష్టించారు. తాను సాధించిన ఈ రికార్డును ఆంధ్ర భూమికి అంకితం చేస్తున్నానని, ఈ అవార్డును సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అందుకోవాలని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘మీ అసాధారణ విజయానికి అభినందనలు అమ్మా. త్వరలో కలుద్దాం.’ అని పోస్టు పెట్టారు.