కుక్కలు ఎంతో విశ్వాసం చూపించే జంతువులు. ఒక్క ముద్ద ఆహారం పెడితే మనపై ఎంతో విశ్వాసం చూపిస్తాయి. అలాంటి ఓ శునకానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ శునకం అనారోగ్యంతో ఉన్న తన పప్పి (కుక్కపిల్ల)ని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఆ పప్పీకి వైద్యం చేసినట్లు సదరు వెటర్నరీ వైద్యులు తెలిపారు. ఈ వీడియో టర్కీలోని ఇస్తాంబుల్ నగరానికి చెందినదిగా అర్థమౌతోంది.