తాగునీటి కోసం వచ్చి మహిళను హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. థానే జిల్లాకు చెందిన చంద్ ఓ ఇంటి వద్దకు వచ్చి తాగడానికి నీళ్లు అడిగాడు. మహిళ నీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళ్లగా ఆమె వెంట లోపలికి వెళ్లి అరుపులు వినబడకుండా టీవీ సౌండ్ పెంచి హత్య చేశాడు. తర్వాత ఒంటిపై నగలను చోరీ చేశాడు. హత్య గత నెలలో జరగగా పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు. బిజినెస్ పెట్టడానికి డబ్బుల కోసం హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.