ఏపీ కేబినెట్ భేటీలో నేడు ప్రధానంగా కాకినాడ పోర్టు అంశంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీ సీఎంఓకు ఆర్మీ, నేవీ అధికారులు వెళ్లారు. మరోపక్క బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టింది. ఐదు డిపార్ట్‌మెంట్ల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసింది.