అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పత్రికలకు ప్రకటనలపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా శాసనసభ దద్దరిల్లింది. సమాచార శాఖ మంత్రి పార్థసారధి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పత్రికలకు ప్రకటనలు ఇచ్చే విషయంలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. ఒక ప్రముఖ పత్రికకు రూ.420 కోట్ల ప్రకటనలు ఇచ్చారని, ఒక జీవోను అడ్డుపెట్టుకుని అధికారులు విచ్చలవిడిగా వ్యవహరించారన్నారు.