కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చేలా కనబడుతోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేయగా ఆయన బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో అవినాష్ పాత్రను నిర్ధారించేలా తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో అని ఉత్కంఠ నెలకొంది.