AP: వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై ఏసీపీ ఉచ్చు బిగిస్తోంది. పల్నాడు జిల్లా యాడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న అభియోగాలతో వారిరువురిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. జాషువాపై విచారణ చేపట్టేందుకు ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. విడదల రజినిపై విచారణకు అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ రాసింది. ఆమోదం తెలిపిన వెంటనే ఇద్దరిపై కేసు నమోదు చేయనున్నారు.