AP: త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి మెగా బ్రదర్ నాగబాబు పెద్దల సభకు వెళతారని ప్రచారం జరిగింది. అయితే మధ్యలో బీజేపీ తరపున ఆర్.కృష్ణయ్య రావడంతో ఆయన సీటుపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నాగబాబు ఆరేళ్లపాటు పదవిలో ఉండేలా 2026లో రాజ్యసభకు పంపేందుకు కూటమి నేతలు నిర్ణయించారట. అప్పుడు కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని పవన్ భావిస్తున్నారని సమాచారం.