ప్రజల మధ్య చిచ్చుపెట్టి, సామాజిక విభజనకు పాల్పడే వారు అన్ని చోట్లా ఉన్నారని, వారితో చాలా ప్రమాదమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ అల్లర్ల నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. సంభాల్‌లో అల్లర్ల వెనుక బీజేపీ ప్రమేయం ఉందంటూ ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలను ఖండించారు.