తిరుమల శ్రీవారిని ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆకాశ్ అంబానీకి వేద పండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేశారు. తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని బహుకరించారు.