AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి ప్రజలను హెచ్చరించింది. రానున్న మూడు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా నంద్యాల, కర్నూలు, అన్నమయ్య జిల్లాలో పిడుగులు ఉధృతంగా పడే ఛాన్స్ ఉందని అధికారులు వివరించారు. ప్రజలు అత్యవరమైతేనే బయటికి రావాలని సూచించారు.