నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న మూవీ S/O వైజయంతి. ఈ మూవీలో సీనియర్ నటి విజయశాంతి హీరోకి తల్లిగా నటిస్తున్నారు. అలాగే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక ఈ మూవీకి ప్రదీప్ చిలకూరి డైరెక్షన్ వహించగా.. ఆశోక్ వర్దన్, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానున్నట్లు అధికారికంగా తెలిపింది.