బెంగళూరు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ దుండగుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బీహార్‌కు చెందిన ఓ యువతి కేరళలో పనిచేస్తుంది. స్వగ్రామానికి బయలుదేరే క్రమంలో బెంగళూరుకు వచ్చింది.కేఆర్ పురం స్టేషన్ రాగానే కజిన్‌తో కలిసి ఆహారం కోసం స్టేషన్ బయటికి వచ్చింది. స్టేషన్ బయట ఉన్న ఇద్దరు దుండగులలో ఒకతను కజిన్‌ను అడ్డుకోగా మరొక అతను యువతిపై అత్యాచారం చేశాడు. పోలీసులు నిందితులను పట్టుకొని కేసు నమోదు చేశారు.