ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగాకు నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగాకులో శరీరానికి అవసరమైన విటమిన్లు ఏ, సి, ఈ, తోపాటు పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పరగడుపున మునగాకు నీటిని తాగడం వలన శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. ఇంకా దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులైన గుండె, మధుమేహం నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.