ఆన్‌లైన్ ప్రకటనలపై విధిస్తున్న డిజిటల్ ట్యాక్స్‌ను తొలగించేలా ఆర్థిక బిల్లులో కేంద్రం సవరణ చేసింది. దీనితో గూగుల్, ఎక్స్, మెటాలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై అడ్వర్టైజ్‌మెంట్ సర్వీసులు అందించే సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సవరణ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు ప్రతిపాదిత 59 సవరణల్లో ఇది కూడా ఒకటి.