ఏపీలో ప్రతి రైతుకు ఏ కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో మంత్రి సవిత పర్యటించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న అరటిపంటను మంత్రి పరిశీలించారు. అకాల వర్షం, వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. పంట నష్టం బాధతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన రైతులను మంత్రి పరామర్శించారు.