అనకాపల్లి మండలంలోని ఉగ్గినిపాలెం గ్రామ శివారులో కోడిపందేలు ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసామని సీఐ అల్లు స్వామి నాయుడు తెలిపారు. సోమవారం తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తమ సిబ్బందికి సూచించిన మేరకు కోడిపందేల స్థావరంపై దాడి చేశారు. ఈ దాడుల్లో రెండు కోడిపుంజులు, 1200 నగదు స్వాధీనం చేసుకొని ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.