రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబ్జి జి ఫణీంద్ర కుమార్ ఆధ్వర్యంలో అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ నెహ్రూ చౌక్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలనే ఆలోచన సరికాదని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొవడం సమంజసం కాదన్నారు.