అనకాపల్లిలో పట్టణ వ్యాపారులు, ముఠా కార్మికుల మద్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయని జిల్లా ముఠా కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి రొంగలి రాము తెలిపారు. అనకాపల్లి ముఠా కార్మికులు జనరల్ బాడీ సమావేశం కాయకూరల మార్కెట్ వద్ద బీశేటి అప్పారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాము మాట్లాడుతూ ముఠా కార్మికులకి వర్తక సంఘం ప్రతినిధులు మధ్య లేబర్ ఆఫీసులో శనివారం చర్చలు జరిగాయని కానీ విఫలమయ్యాయని తెలిపారు.