కొయ్యూరు మండలంలోని మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి పెదమాకవరం నల్లగొండకు మధ్య ఉన్న వంతెన ఆదివారం కొట్టుకుపోయిందని గిరిజనులు తెలిపారు. దీనితో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు ప్రభుత్వం స్పందించి కొట్టుకుపోయిన వంతెనకు నిర్మాణం చేపట్టి గిరిజనుల రవాణా కష్టాలు తీర్చాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు.