అనంతగిరి: సొంతంగా రోడ్డు నిర్మాణం

78చూసినవారు
అనంతగిరి మండలం జీనపాడు పంచాయతీ దయర్తి పీవీటీజీ గిరిజనులు సొంతంగా తమ గ్రామానికి మూడు కిలో మీటర్ల రోడ్డును నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎవరికైనా అనారోగ్యం చేస్తే డోలి మోతలు తప్పడం లేదని వాపోయారు. దీంతో గత ఐదు రోజులుగా గ్రామస్థులందరూ శ్రమించి రోడ్డు నిర్మాణం చేసుకున్నామని చెప్పారు. ఇప్పటికైనా శాశ్వత రోడ్డు నిర్మాణం చేపట్టాలని గురువారం కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్