అరకులోయలోని చలి తీవ్రత మరింత పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల వల్ల ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు హెడ్లైట్లేసుకొని రాకపోకలు కొనసాగించారు. రాత్రి వేళల్లోనే కాదు పగటిఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోతుండడంతో జనాలు ఇల్లా నుంచి బయటకు రావాలంటే గజగజ వణుకుతున్నారు. పొద్దుపొద్దునే పక్షులు కిలకిలరావాలతో మనసుకు ఆహ్లాదనిస్తున్నాయి.