డుంబ్రిగుడ మండలంలోని చలి వణికిస్తోంది. మండలంలోని ఏఓబి సరిహద్దు గ్రామాలైన గోరాపుర్ చటువా తదితర గ్రామాల్లో రాత్రి తెల్లవారుజామున చలిమంటలు కనిపిస్తున్నాయి. ఉదయం 10గంటలు దాటిన పొగమంచు తెర తొలగడం లేదు. దీనితో వాహనదారులు హెడ్లైట్లు వేసుకొని రాకపోకలు కొనసాగించారు. గత వారంలో కురిసిన వర్షాల వల్ల రాత్రి వేళే కాకుండా మిట్ట మధ్యాహ్నం సైతం ఈదురుగాలులు వీస్తున్నాయి. కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.