ప్రముఖ సందర్శన ప్రాంతమైన డుంబ్రిగుడ మండలంలో ఉన్న చాపరాయి జలవిహారికి శనివారం పర్యటకులు సందడి చేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి సంక్రాంతి సెలవుల నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సమేతంగా చాపరాయి జలవిహారిలో పలు ప్రాంతాల పర్యటకులు చేరుకొని స్నానాలు చేస్తూ సందడి చేస్తూ ఫోటోలకు ఫోజులుస్తూ మంత్రముగ్దులయ్యారు. అయితే చాపరాయిలో వారం రోజులపాటు పర్యాటకుల రద్దీ పెరగనుందని నిర్వాహకులు తెలిపారు.