హుకుంపేట: డల్లపల్లికు తారురోడ్డు నిర్మించాలి

67చూసినవారు
హుకుంపేట మండలంలోని చీకుమద్దుల నుండి డల్లపల్లి వరకు తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం నిర్మించిన తారురోడ్డుతో సిసి రోడ్డు శిధిలావస్థకు చేరుకొని అధ్వానంగా తయారవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు మంగళవారం తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారులు స్పందించి చీకుమద్దుల నుంచి డల్లపల్లి వరకు తారురోడ్డు నిర్మించి తమ కష్టాలు తీర్చాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్