లక్షా యాభై వేల రూపాయలతో కిలో మీటరు మట్టి రోడ్డుకు మరమ్మతులు చేపడుతున్నట్లు హుకుంపేట మండలం, తీగలవలస పంచాయితీ సర్పంచ్ బేసు తెలిపారు. పంచాయితీలోని డీ. గరుడాపల్లి గ్రామం యొక్క కీలో మీటరు మట్టి రోడ్డు గుంతలతో ఉంది. దీంతో ప్రయాణానికి చాలా కష్టతరంగా ఉండటంతో గుంతలకు మరమ్మత్తులు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్-ఛార్జ్ కె. కామరాజు, భీమరాజు, మర్రి లింగేశ్వరరావు పాల్గొన్నారు.