ముంచంగిపుట్టు మండలంలో శుక్రవారం 30 కిలోల గంజాయి పట్టుబడిందని ఎస్ఐ రవీంద్ర తెలిపారు. ఎస్ఐ రవీంద్ర కథనం ప్రకారం మండలంలోని బాబుసాల పంచాయతీ పరిధి జడిగూడ గ్రామంలో పోలీసుల విశ్వాసనీయ సమాచారంతో తనిఖీలు చేయగా కొర్ర అసు అనే గిరిజనుడు అమ్మకానికి సిద్ధంగా దాచిన 30 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు. అయితే నిందితుడు అసు పారిపోతుండగా పోలీసులు ఎంబడించి పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించమన్నారు.