అనంతగిరి మండల కేంద్రంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల-02లో విద్యావేత్త, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. మంగమ్మ, ఉపాధ్యాయులతో కలసి డాక్టర్ రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా హెచ్ఏం మంగమ్మ ఉపాధ్యాయుల దినోత్సవం విశిష్టత ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.