ఆనందపురం: బీజేపీ కార్యాలయంలో వాజ్ పేయి జయంతి

81చూసినవారు
ఆనందపురం మండలం వెల్లంకి బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని చెప్పారు. నిజమైన సుపరిపాలన అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్