పరిసరాల పరిశుభ్రతతో ప్రజలను ఆరోగ్యంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులు నిజమైన హీరోలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల కోసం మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. విజయవాడ వరదల్లో నీటిలో ఉంటూ ప్రజలు అంటురోగాల బారిన పడకుండా పనిచేసిన జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది సేవలను ప్రశంసించారు.