భీమిలి: అక్రమంగా నిర్మించిన రెస్టారెంట్లను తొలగించాలి
భీమిలి నుంచి విశాఖ తీరం వెంబడి అక్రమంగా నిర్మించిన బార్ అండ్ రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలని భీమిలి మత్స్యకార సంఘం నాయకుడు గంటా నూకరాజు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా మత్స్యకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భీమిలిలో ప్రారంభమైన రిలే దీక్షలు శుక్రవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న హోటల్స్ పై చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యకారుల మనోభావాలు దెబ్బతిస్తే సహించేది లేదన్నారు.