రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ప్రస్తుత సిఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 16న విజయవాడలో జరిగే మహాధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. మంగళవారం బుచ్చయ్యపేట మండలంలోని సీతయ్యపేట శ్రీదుర్గాభవాణి ఆటో స్టాండ్ వద్ద సమావేశం నిర్వహించారు.