జనవరి 5వ తేదీన చోడవరం హార్డెంజ్ రెస్ట్ హౌస్ ప్రాంగణంలో సీడీవీఎం ఫౌండేషన్ అనుబంధంగా ఉన్న సద్భావ టీం ఆధ్వర్యంలో నిర్వహించనున్న జీవధార రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం సాయంత్రం వడ్డాది గ్రామంలో రక్తదాన శిబిరంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వడ్డాది ఎస్సార్ ఫిట్నెస్ జిమ్ లో రక్తదానంపై అవగాహన కల్పించారు. కరపత్రాలు పంపిణీ చేసి డోర్ టు డోర్ ప్రచారం చేపట్టారు.