బిఎన్ రోడ్డు లో వడ్డాది ప్రభుత్వ కళాశాల వద్ద భారీ గొయ్యిలు ఏర్పడ్డాయి. చిన్న పాటి వర్షం వస్తే చాలు ఇవి చెరువులా తలపిస్తున్నాయి. వాహన చోదకులు ఈ రహదారి గుండా ప్రయాణం చేయాలంటే నరక యాతన అనుభవిస్తున్నారు. గురువారం వడ్డాది పట్టణ టిడిపి అధ్యక్షులు దొండా నరేష్ తన సొంత నిధులతో గొయ్యిలు పుడ్చానికి ముందుకొచ్చారు. జేసీబీ, ట్రాక్టర్ లను రప్పించి గొయ్యిలను మట్టితో పూడ్చివేయించి చదును చేయించారు. పలువురు ఆయనను అభినందించారు.