ప్రశాంత జీవనానికి ఉద్యోగ విరమణ ఓ వరం వంటిదని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీనియర్ ఇన్స్పెక్టర్ కె. గుణసుందర్రావు అన్నారు. చోడవరం బ్రాంచ్ మేనేజర్ కె. శ్రావణ్ కుమార్ అధ్యక్షతన ఉద్యోగుల విరమణ సన్మాన సభను మంగళవారం బ్రాంచి కార్యాలయంలో నిర్వహించారు. ఉద్యోగికి పదవి విరమణ తరువాయి జీవితానికి ప్రశాంతమైనదని అధికారులు ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా విరమణ పొందిన జేసోమనాయుడు, హేమశ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు.