చోడవరంలో గల వైసీపీ కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ విప్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ధర్మశ్రీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరు ప్రారంభించిన పనులు విజయవంతం కావాలని కోరుకున్నారు.