ఇండియా కెమ్ - 2024, 13వ ద్వైవార్షిక అంతర్జాతీయ ప్రదర్శన, సమావేశంలో భాగంగా ఫీక్కీ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా శుక్రవారం ఇండస్ట్రీ మీట్ నిర్వహించనున్నట్లు గురువారం నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ మీట్ జరుగుతుందని, వివిధ కంపెనీల ప్రతినిధులు భాగస్వామ్యమై వివిధ అంశాలపై చర్చించనున్నారని పేర్కొన్నారు.