నర్సీపట్నం మున్సిపాలిటీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్మన్ తో పాటు కొంతమంది వైసీపీ సభ్యులు సమావేశానికి హాజరుకాలేదు. మెజార్టీ ఉండటంతో కార్యక్రమం నిర్వహించారు. ఇద్దరు వైసీపీ సభ్యులు కూటమికి మద్దతు ఇచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి, వైసీపీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహ మూర్తి సమావేశానికి హాజరయ్యారు.