క్యాన్సర్ నియంత్రణకు చైతన్య స్రవంతి సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 37వ వార్డు సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో చైతన్య స్రవంతి స్వచ్చంద సేవా సంస్థ ఆదివారం నిర్వహించిన ది హ్యూమన్ పాపిలోమా వైరస్ నియంత్రణ క్యాన్సర్ వ్యాక్సిన్ బూస్టర్ శిబిరాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి నివారణకు చైతన్య స్రవంతి ముందుకు రావడం పై హర్షం వ్యక్తం చేశారు.