మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తల్లి, చెల్లి ఇద్దరిపై ఏదో రోజు జగన్ కేసు పెడతాడని తాను ముందే అనుకున్నానని. ఇప్పుడు అదే జరిగిందన్నారు. సీఎం కుర్చీ కోసం సొంత బాబాయిని చంపేశారని మండిపడ్డారు. ‘‘కానీ మేము ఇప్పుడు చెల్లికి తల్లికి మేము రక్షణ కల్పిస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.