జి. మాడుగుల మండలంలోని మత్స్యరాస ఘాట్ రోడ్డు వద్ద నిర్వహిస్తున్న వారపు మంగళవారం తారుమారు సంతకు ఏఓబి ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఈ సంతలో దొరకని వస్తువంటూ ఉండదు. గుండుసూది నుంచి గుణపాల వరకు పక్కపిన్ను నుంచి పాడిపశువుల దాకా అన్ని సరసమైన ధరలకు లభిస్తాయి. పూర్వం నుంచి ఈ సంతకు ఆదరణ పెరుగుతూనే ఉంది. సంక్రాంతికి ముందుగా ఈ సంతకు ఏఓబి ప్రాంతాల నుంచి గిరిజనులు నూతన వస్త్రాలు నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి వెళ్తారు.