పాడేరు: ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఔట్ సోర్స్ టీచర్ల నిరసన

81చూసినవారు
పాడేరు: ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఔట్ సోర్స్ టీచర్ల నిరసన
గిరిజన గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల్లో గత 10-15 ఏళ్ళుగా పనిచేస్తున్న ఔట్ సోర్స్ టీచర్లు, లెక్చరర్లను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చాలని ఔట్ సోర్స్ టీచర్లు పాడేరు ఐటీడీఏ వద్ద శనివారం నిరసన తెలిపారు. వారు ప్రభుత్వం ఇచ్చే కొత్త డిఎస్సీలో ఔట్ సోర్స్ టీచర్లకు ఇచ్చిన 1143 పోస్టులను కలపరాదని మరియు ఉద్యోగ భద్రత కల్పించి, 2022 పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్