దుగ్గాడ ఛానలకు సంబంధించి సుంకపూర్ సెగ్మెంట్ ఎన్నికను వాయిదా వేసినట్లుగా ఎన్నికల అధికారి రాణి ప్రకటించడంతో జనసేన, టీడీపీ (రెబల్), వైసీపీ నాయకులుకోటవురట్ల మండలం జల్లూరు ఎన్నికల కేంద్రం వద్ద శనివారం బైఠాయించారు. జనసేన మండల అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికలు వాయిదా వేయడం చట్ట విరుద్ధమన్నారు. నామినేషన్ పత్రాన్ని చించివేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.