కోటవురట్ల: ఎంపీటీసీ నిధులతో తాగునీటి బోరు

50చూసినవారు
కోటవురట్ల ఎంపీటీసీ నిధులతో స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి తాగునీటి బోరు మంజూరు అయింది. ఈ మేరకు ఎంపీటీసీ పీవీ సూర్యారావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ తాగునీటి బోరుకు తన ఎంపీటీసీ నిధులనుంచి రూ. 2 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. బోరు మంజూరుతో తహశీల్దార్ కార్యాలయానికి తాగునీటి సమస్య పరిష్కారం అయినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్