చేపలు మృతిపై అధికారులు ఆరా

52చూసినవారు
చేపలు మృతిపై అధికారులు ఆరా
నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద గల హెట్రో ఫార్మా కంపెనీ రసాయనిక వ్యర్థ జలాలను ఉప్పుటేరులో విడుదల చేస్తున్న కారణంగా అందులో చేపలు మృత్యువాత పడడంతో ఫిషరీస్ అధికారులు స్పందించారు. సోమవారం వారు చేపలు మృతి చెందిన ఉప్పుటేరును పరిశీలించి నమూనాలు తీసుకుని మత్స్యకారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెట్రో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరారు. సిపిఎం జిల్లా నాయకుడు అప్పలరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్