పరవాడ రక్షిత్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సోమవారం పెందుర్తిలో స్పందించారు. కంపెనీ పొరపాటు వల్ల ప్రమాదం జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరగకుండా ఫార్మా కంపెనీలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు జరక్కుండా తీసుకోవలసిన చర్యలపై మరోసారి ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.