పెందుర్తి జంక్షన్ నుంచి ఆనందపురం రోడ్డు విస్తరణలో నష్టపోయిన ప్రజలకు న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్ ఎస్ అప్పలనాయుడు డిమాండ్ చేశారు. సోమవారం నష్టపోయిన బాధితులతో కలిసి రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తను కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఈ విధంగా నష్టపోయిన బాధితులకు టీడీఆర్ లు మంజూరు చేసి న్యాయం చేశామన్నారు. అదేవిధంగా బాధితులను ఆదుకోవాలని అన్నారు.