చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో 12 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ప్రశాంతంగా శాసనమండలి ఎన్నికలు నిర్వహించడం జరిగిందని రంపచోడవరం సబ్ కలెక్టర్ ఎన్నికల ఏఆర్వో కల్పనశ్రీ అన్నారు. 88. 70 శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు. రంపచోడవరం చింతూరు డివిజన్లో మొత్తం 12 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 637 ఓట్లకుగానూ 565 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.