విశాఖ దక్షిణ నియోజకవర్గం 32వ వార్డులో కార్పొరేటర్ కందుల నాగరాజు బుధవారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చవితి పండుగను మట్టి విగ్రహాలతో జరుపుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ది పారిస్ రసాయనిక రంగులతో తయారుచేసిన విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని అన్నారు.